After logo

స్త్రీ పురుషుల సమానత్వం పై చర్చా

0 30
*స్త్రీ పురుషుల సమానత్వం పై చర్చా*  ఏకాత్మత బాల్ వికాస్ సేవ యోజన - ప్రభాదేవి కార్యాలయం ఆధ్వర్యంలో "స్త్రీ పురుష సమానత్వం" అనే అంశంపై మంగళవారం ముంబై ప్రభాదేవి డాక్టర్ అంబేడ్కర్ నగర్లో చిన్నారులు వారి పాలకుల మధ్య చర్చాగోష్ఠి జర్పారు. ప్రముఖ మార్గదర్శకులుగా విచ్చేసిన ప్రధానోపాధ్యాయులు మూల్ నివాసి మాలజీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళ పురుషులకు సమాన గౌరవం హోదా హక్కులు కల్పించిన ఘనత ఉందని కొనియాడారు. వివరాల్లోకి వెళ్తే... మహిళలకు పురుషులతో సమాన వేతనం, అస్తిలో ఇక్కువల్ వాటా కల్పిస్తూ ఉద్యోగ భద్రతలో భాగంగా గర్భిణి స్త్రీలకు మెటర్నిటీ తదితర సౌకర్యాలు కల్పించిందని తెలియజేశారు. అయితే వాటన్నింటినీ తాము పూర్తిగా అనుభవించాలంటే నిరంతరం రాజ్యాంగ అధ్యయనం చేయాలని, ప్రతి మహిళ స్వయం చైతన్యం చెందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిలో అంగన్వాడీ సేవికలైన కాంత గైక్వాడ్, రేవతి బంసోడే, నమిత అంబ్రే, వర్షా కుంబార్, అరుణ గవలి, రేఖా ఖరాత్, జనబాయ్ సావంత్, మద్దత్ నిస్ మంగళ యాదవ్ లు ఉత్సవంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం ఇద్దాం పిల్లల్ని సదృడంగా చేద్దాం, అన్నంతో అరటి పండ్లు ఇచ్చి డైజేషన్ ప్రక్రియ పెంచుద్దాం, సుజాన్ పాలకుల లక్ష్యం పిల్లల సమగ్ర వికాసం అంటూ అంగన్వాడీ సేవికలు నినాదాలు చేశారు. అనంతరం పసిపిల్లల తల్లుల తోపాటు తండ్రులైన సీతా గణేష్ పద్మశాలి, నాగుల భారత్ పద్మశాలి, ప్రకాష్ చావుడా, అంబేడ్కరీస్ట్ రాజేష్ గోలప్ లు పాల్గొన్నారు. చివరికి విద్యార్థులకు బహుమతులు పౌష్టిక తినుబండారాలు అందజేశారు.
*స్త్రీ పురుషుల సమానత్వం పై చర్చా*
ఏకాత్మత బాల్ వికాస్ సేవ యోజన – ప్రభాదేవి కార్యాలయం ఆధ్వర్యంలో “స్త్రీ పురుష సమానత్వం” అనే అంశంపై మంగళవారం ముంబై ప్రభాదేవి డాక్టర్ అంబేడ్కర్ నగర్లో చిన్నారులు వారి పాలకుల మధ్య చర్చాగోష్ఠి జర్పారు. ప్రముఖ మార్గదర్శకులుగా విచ్చేసిన ప్రధానోపాధ్యాయులు మూల్ నివాసి మాలజీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళ పురుషులకు సమాన గౌరవం హోదా హక్కులు కల్పించిన ఘనత ఉందని కొనియాడారు. వివరాల్లోకి వెళ్తే… మహిళలకు పురుషులతో సమాన వేతనం, అస్తిలో ఇక్కువల్ వాటా కల్పిస్తూ ఉద్యోగ భద్రతలో భాగంగా గర్భిణి స్త్రీలకు మెటర్నిటీ తదితర సౌకర్యాలు కల్పించిందని తెలియజేశారు. అయితే వాటన్నింటినీ తాము పూర్తిగా అనుభవించాలంటే నిరంతరం రాజ్యాంగ అధ్యయనం చేయాలని, ప్రతి మహిళ స్వయం చైతన్యం చెందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిలో అంగన్వాడీ సేవికలైన కాంత గైక్వాడ్, రేవతి బంసోడే, నమిత అంబ్రే, వర్షా కుంబార్, అరుణ గవలి, రేఖా ఖరాత్, జనబాయ్ సావంత్, మద్దత్ నిస్ మంగళ యాదవ్ లు ఉత్సవంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం ఇద్దాం పిల్లల్ని సదృడంగా చేద్దాం, అన్నంతో అరటి పండ్లు ఇచ్చి డైజేషన్ ప్రక్రియ పెంచుద్దాం, సుజాన్ పాలకుల లక్ష్యం పిల్లల సమగ్ర వికాసం అంటూ అంగన్వాడీ సేవికలు నినాదాలు చేశారు. అనంతరం పసిపిల్లల తల్లుల తోపాటు తండ్రులైన సీతా గణేష్ పద్మశాలి, నాగుల భారత్ పద్మశాలి, ప్రకాష్ చావుడా, అంబేడ్కరీస్ట్ రాజేష్ గోలప్ లు పాల్గొన్నారు. చివరికి విద్యార్థులకు బహుమతులు పౌష్టిక తినుబండారాలు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.