After logo

ఆంధ్రుల దుర్గ‌మ్మ‌.. తెలంగాణ బ‌తుక‌మ్మ‌…

0 61
*ఆంధ్రుల దుర్గ‌మ్మ‌.. తెలంగాణ బ‌తుక‌మ్మ‌...!* *బతుక‌మ్మ ఆట‌తో పుల‌కించిన కృష్ణాతీరం** *పున్న‌మీ ఘాట్ వ‌ద్ద తెలంగాణ సాంప్ర‌దాయ పండ‌గ‌ను చాటిన తెలుగు రాష్ట్రాల మ‌హిళ‌లు* *విజ‌య‌వాడ‌,  రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంద‌రూ ఒకటేన‌ని, ఎక్క‌డ ఉన్నా తెలుగువారి సాంప్ర‌దాయాన్ని ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చేస్తామ‌ని చాటుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మ‌హిళ‌లు ఆడిన బ‌తుక‌మ్మ ఆట‌తో విజ‌య‌వాడ కృష్ణాతీరం పుల‌కించింది. తెలంగాణా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అతిపెద్ద పండ‌గ బ‌తుక‌మ్మ‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులంద‌రూ ఈ పండ‌గ‌కు మాత్రం వారివారి స్వ‌గ్రామానికి త‌ప్ప‌క చేరుకుంటారు. అలా రావ‌డం కుద‌ర‌నివారు దేశ‌, విదేశాల్లో ఎక్క‌డ ఉన్నా అక్క‌డే రంగురంగుల పూల‌తో బ‌తుక‌మ్మను పేర్చి సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఆడిపాడుతూ.. బ‌తుక‌మ్మను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తారు. ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా న‌గ‌రంలోని మాచ‌వ‌రానికి చెందిన ప‌లువురు మ‌హిళ‌లు గురువారం రాత్రి పున్న‌మీ ఘాట్ వ‌ద్ద తెలంగాణ సాంప్రదాయానికి చెందిన బతుకమ్మను విభిన్న రంగుల పూల‌తో పేర్చి ఆనంద‌తాండ‌వం చేస్తూ బ‌తుక‌మ్మ చుట్టూ ఆడిపాడారు. బ‌తుక‌మ్మ ఆట‌ను కృష్ణాతీరంలో నిర్వ‌హించ‌డంతో సంద‌ర్శ‌కులు పెద్ద సంఖ్య‌లో విచ్చేసి వారిని అభినందించారు. బ‌తుక‌మ్మ ఆడిన వారిలో తెలంగాణ‌కు చెందిన మ‌హిళ‌లు కూడా ప‌లువురు ఉన్నారు. ఆట‌లో మ‌హిళా మణులు తోలేటి స‌రిత‌, తోలేటి మాధ‌వి, ధనలక్ష్మి, గోవిందమ్మ, శారద, పద్మశ్రీ, గీత, రోజా, ప్రసన్న పాల్గొన్నారు. ఆట‌పాట‌లు అనంత‌రం బ‌తుక‌మ్మ‌ను కృష్ణాన‌దిలో నిమ‌జ్జ‌నం చేశారు.*
*ఆంధ్రుల దుర్గ‌మ్మ‌.. తెలంగాణ బ‌తుక‌మ్మ‌…!*
*బతుక‌మ్మ ఆట‌తో పుల‌కించిన కృష్ణాతీరం**
*పున్న‌మీ ఘాట్ వ‌ద్ద తెలంగాణ సాంప్ర‌దాయ పండ‌గ‌ను చాటిన తెలుగు రాష్ట్రాల మ‌హిళ‌లు*
*విజ‌య‌వాడ‌, రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంద‌రూ ఒకటేన‌ని, ఎక్క‌డ ఉన్నా తెలుగువారి సాంప్ర‌దాయాన్ని ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చేస్తామ‌ని చాటుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మ‌హిళ‌లు ఆడిన బ‌తుక‌మ్మ ఆట‌తో విజ‌య‌వాడ కృష్ణాతీరం పుల‌కించింది. తెలంగాణా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అతిపెద్ద పండ‌గ బ‌తుక‌మ్మ‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులంద‌రూ ఈ పండ‌గ‌కు మాత్రం వారివారి స్వ‌గ్రామానికి త‌ప్ప‌క చేరుకుంటారు. అలా రావ‌డం కుద‌ర‌నివారు దేశ‌, విదేశాల్లో ఎక్క‌డ ఉన్నా అక్క‌డే రంగురంగుల పూల‌తో బ‌తుక‌మ్మను పేర్చి సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఆడిపాడుతూ.. బ‌తుక‌మ్మను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తారు. ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా న‌గ‌రంలోని మాచ‌వ‌రానికి చెందిన ప‌లువురు మ‌హిళ‌లు గురువారం రాత్రి పున్న‌మీ ఘాట్ వ‌ద్ద తెలంగాణ సాంప్రదాయానికి చెందిన బతుకమ్మను విభిన్న రంగుల పూల‌తో పేర్చి ఆనంద‌తాండ‌వం చేస్తూ బ‌తుక‌మ్మ చుట్టూ ఆడిపాడారు. బ‌తుక‌మ్మ ఆట‌ను కృష్ణాతీరంలో నిర్వ‌హించ‌డంతో సంద‌ర్శ‌కులు పెద్ద సంఖ్య‌లో విచ్చేసి వారిని అభినందించారు. బ‌తుక‌మ్మ ఆడిన వారిలో తెలంగాణ‌కు చెందిన మ‌హిళ‌లు కూడా ప‌లువురు ఉన్నారు. ఆట‌లో మ‌హిళా మణులు తోలేటి స‌రిత‌, తోలేటి మాధ‌వి, ధనలక్ష్మి, గోవిందమ్మ, శారద, పద్మశ్రీ, గీత, రోజా, ప్రసన్న పాల్గొన్నారు. ఆట‌పాట‌లు అనంత‌రం బ‌తుక‌మ్మ‌ను కృష్ణాన‌దిలో నిమ‌జ్జ‌నం చేశారు.*

Leave A Reply

Your email address will not be published.