After logo

యువత వాస్తవ చరిత్ర తెలుసుకోవాలని జాతీయ సాహిత్య పరిషత్ అఖిల భారత అధ్యక్షులు డా.ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి

0 61
*చరిత్రలోని వాస్తవాలు తెలుసుకోవాలి*

యువత వాస్తవ చరిత్ర తెలుసుకోవాలని
జాతీయ సాహిత్య పరిషత్ అఖిల భారత అధ్యక్షులు డా.ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి  అన్నారు. 

నిర్మల్ జిల్లా  భైంసా పట్టణంలోని గౌరీ శంకర్ (ఎస్ ఆర్) గార్డెన్లో  నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల పేరుతో బుధవారం యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా  వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. చరిత్రను భావితరాలకు తెలిపేందుకే నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిందని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలోనే ఉండేదన్నారు. నిజాం నవాబు సైన్యమైన రజకార్లు తెలంగాణ ప్రజలపై సాగించిన దమనకాండ, అకృత్యాలు సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. కుమురంభీం, చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, రాంజీగొండ్ లాంటి ఎంతోమంది ప్రాణాలకు తెగించి సమాజాన్ని కాపాడారన్నారు. గతంలో తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులు భవిష్యత్తులో రాకూడదంటే, నాటి పోరాటస్ఫూర్తి నేటి యువతలో ఉండాలని నిజాం విముక్తా స్వాతంత్ర్య అమృతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.భైంసాలో నిర్వహించిన సమ్మేళనానికి 2వేల మంది యువతీ యువకులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రాంత సహా సంఘచాలక్ సుందర్ రెడ్డిగారు,విభాగ్ సంఘ చాలక్ నరేందర్ రెడ్డి , ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆకాష్ పటేల్ , నూకల విజయ్ కుమార్ , సాదుల కృష్ణదాస్ , రాజుల వార్ దిగంబర్ , బాషెట్టి రమేష్ , శైలేష్ మాషెట్టివార్ ,ఉత్సవ సమితి సభ్యులు,వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.