After logo

సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే

0 8
హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది మహేశ్‌బాబు కుటుంబానికి తీరని వేదనను కలిగించింది. సోదరుడు రమేశ్‌బాబు, తల్లి ఇందిర, తండ్రి కృష్ణల మరణాలు ఒకదాని వెంట ఒకటి జరగడంతో మానసికంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఇటీవల మరణించిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేశ్‌బాబు తొలిసారి స్పందించారు. ట్విటర్‌ వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు.

‘‘మీ జీవితం గొప్పగా సాగింది. చివరి వరకూ ధీశాలిగా, ధైర్యసాహసాలు కలబోసిన వ్యక్తిగా జీవించారు. నా స్ఫూర్తి, నా ధైర్యం నేను చూసినదంతా మీతోనే వెళ్లిపోయాయి. అదేంటో, గతంతో పోలిస్తే ఇప్పుడు నేను మరింత దృఢంగా ఉన్నానని అనిపిస్తోంది. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు.. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. మీ అందించిన వారసత్వాన్ని కొనసాగిస్తా.. మీరు మరింత గర్వపడేలా నడుచుకుంటా. లవ్‌వ్యూ నాన్న..’’ అని ట్వీట్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.